లేదు. సంరక్షణ బాధ్యత అనేది కేవలం కొడుకులు, కూతుళ్లకు సంబంధించినది మాత్రమే. అల్లుళ్లు, కొడళ్లకు ఆ బాధ్యత ఉండదు. అయితే అల్లుడికి బాధ్యత లేకపోయిన అతని భార్యకు తన తల్లితండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. చట్టం ప్రకారం ఆమె ఆ బాధ్యత నేరవేర్చాల్సి ఉంటుంది.