ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 498ఎ అనేది వివాహిత మహిళలకు రక్షణ ఆస్త్రం లాంటిది. భర్త గానీ, భర్త తరపు బంధువులు గానీ భార్యను హింసిస్తూ ఉంటే పై సెక్షన్ ప్రకారం కేసు పెట్టవచ్చు. ఇంతే కాకుండా భార్య గృహ హింస చట్టం సెక్షన్ 12 ప్రకారం కూడా భర్త, భర్త బంధువులపైన కేసు పెట్టవచ్చు. భర్త వద్దే ఉంటే రక్షణ పొందేందుకు గానీ, లేదా విడిగా ఉంటూ మనోవర్తికి గాని పైన పేర్కొన్న చట్టం ద్వారా గృహిణి రక్షణ పొందవచ్చు.