Thursday, September 19, 2024
More
    Homeకుటుంబ సమస్యలుహిందూ అబ్బాయి..క్రిస్టియాన్‌ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పిల్లలకు క్రిస్టియన్‌ గుర్తింపు వస్తుందా?

    హిందూ అబ్బాయి..క్రిస్టియాన్‌ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పిల్లలకు క్రిస్టియన్‌ గుర్తింపు వస్తుందా?

    భారత దేశం పురుషాధిక్యిత సమాజం. మనది పితృస్వామ్యక కుటుంబం. మన దేశంలో పిల్లలకు ఇంటిపేర్లు తండ్రులవే వస్తాయి. అది ఏ మతమైనా అన్ని మతాల్లోనూ పురుషాధిక్యతే ఉన్నది. కాబట్టి అబ్బాయి ఏ మతం వాడో అదే మతం వారి పిల్లలకు కూడా వస్తుంది. ఒక వేళ భార్య కోరిక మేరకు భర్త మతం మారితే తప్ప. హిందూ అబ్బాయి క్రిస్టియన్‌ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పిల్లలకు హిందూ గుర్తింపే వస్తుంది. కులాంతార వివాహాల్లోనూ ఇదే నియమం వర్తిస్తుంది. అబ్బాయిది ఏ కులం అయితే పిల్లలకు అదే కులం వస్తుంది. తండ్రిది అగ్రకులమై తల్లిది దళిత కులమైతే పిల్లలకు రిజర్వేషన్లు వర్తించవు. తండ్రి లాగే పిల్లలు కూడా అగ్రవర్ణాలు అవుతారు. ఒక వేళ పెళ్లి తర్వాత భర్త చనిపోతే తల్లి కోరుకుంటే తల్లి గుర్తింపు లభించే అవకాశముంది. అప్పటికి ఆ పిల్లల కులాన్ని గానీ, మతాన్ని గానీ ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేయకుండా ఉండాలి.

    Most Popular