Wednesday, May 8, 2024
More
    Homeకుటుంబ సమస్యలుగృహహింస చట్టం కిద కేసు పెడితే ఇక విడాకులు తీసుకోవాల్సిందేనా?

    గృహహింస చట్టం కిద కేసు పెడితే ఇక విడాకులు తీసుకోవాల్సిందేనా?

    గృహహింస చట్టంలో రెండు ప్రధాన అంశాలు ఉంటాయి. ఒకటి మనోవర్తి..రెండు వసతి రక్షణ. ఒక వేళ భార్య విడిగా ఉంటూ రోజువారీ ఖర్చులు భర్త ఇవ్వకుంటే ఈ చట్టం ద్వారా మనోవర్తి పొందవచ్చు. అదే విధంగా పెళ్లి సందర్భంలో ఇచ్చిన కట్న, కానుకలన్నింటినీ తిరిగి తీసుకోవచ్చు. అంతే కానీ గృహహింస చట్టం కింద కేసు పెట్టినంత మాత్రాన విడాకులు తీసుకోవాలని ఏమీ లేదు. విడాకులు తీసుకోవడానికి గృహ హింస కేసు పెట్టడమే కారణం కాదు. అయితే భార్య నాలుగైదు కేసులు పెట్టి వేధిస్తూ ఉంటే వేధింపుల ఆరోపణ కింద భర్త విడాకులు కోరవచ్చు.

    Most Popular