Sunday, October 13, 2024
More
    Homeక్రిమినల్ కేసులుఅత్యాచారంరేప్‌ చేస్తే శిక్ష ఎంత పడుతుంది? ఉరిశిక్ష కూడా వేస్తారా?

    రేప్‌ చేస్తే శిక్ష ఎంత పడుతుంది? ఉరిశిక్ష కూడా వేస్తారా?

    ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ సెక్షన్‌ 376 ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి ఒక మహిళను రేప్‌ చేస్తే కచ్చితంగా శిక్ష పడుతుంది. మానభంగం లేదా అత్యాచారం అంటే ఒక పురుషుడు ఒక స్త్రీ ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా, బయపెట్టి లంగదీసుకొని శారీరకంగా అనుభవించడమే అత్యాచారం అవుతంది. సెక్షన్‌ 376 ప్రకారం అత్యాచారం చేసిన వ్యక్తికి 7 సంవత్సరాలు తక్కువ కాకుండా శిక్ష విధించవచ్చు. కొన్ని సందర్బాల్లో జీవిత ఖైదు శిక్ష కూడా విధించవచ్చు. అత్యాచారం మాత్రమే కాకుండా ఆ మహిళలను చిత్రహింసలు పెట్టి చంపితే ఉరిశిక్ష కూడా విధించవచ్చు. ఇటీవల నిర్భయ కేసులో నలుగురు నిందితులకు సుప్రీంకోర్ట్‌్‌ ఉరిశిక్ష విధించింది. అత్యాచారం జరిపిన తీరు, ఆ సమయంలో ఆ మహిళను ఏ విధంగా చిత్ర హింసలు పెట్టారు అనే అంశాల ఆధారంగా శిక్ష పెరుగుతూ ఉంటుంది.

    Most Popular