ఒకే గదిలో ఆడ,మగ దొరికారు అంటే వారి మధ్య ఏవిధమైన సంబంధమైనా ఉండిఉండవచ్చు. వారు అన్నా,చెల్లలు కావచ్చు, తండ్రికూతురు కావచ్చు. భార్యాభర్తలు కావచ్చు. వారు ఒకే రూమ్‌లో ఉన్నంత మాత్రన అక్కడ వ్యభిచారం జరిగినట్లు కాదు. ఆ రూమ్‌ను కేంద్రంగా చేసుకొని పరస్పరం తెలియని ఇద్దరు వ్యక్తుల మధ్య లైంగిక కార్యకలాపాలు డబ్బు కోసం జరుగుతూ ఉంటే దాన్ని మాత్రమే వ్యభిచారం అంటారు. అక్రమ సంబంధం కల్గిన వారు కూడా ఒక్కొసారి పట్టుబడుతుంటారు. వారి కేసు అక్రమ సంబంధం వరకే పరిమితమౌతుంది తప్ప వ్యభిచారం కిందకు రాదు.