ఏ కేసులో నైనా అది చిన్నదయినా, పెద్దదయినా నిందితులపై పోలీసులు చేయి చేసుకోవడాన్ని ఇండియన్ పీనల్ కోడ్ గానీ, ఇతర ఏ భారతీయ చట్టం గానీ అంగీకరించదు. ఒక వేళ వారు అలా చేయి చేసుకుంటే ఐపిసి 323, 324 ప్రకారం శిక్షార్హులవుతాయి. ఏడాది నుండి ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశముంది. పోలీసులు వారు చేయి చేసుకోవడం కంటే పౌరుల హక్కులకు భంగం కల్గించినట్లే అవుతుంది కాబట్టి వారిపైన మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసి న్యాయం పొందవచ్చు.