Monday, April 29, 2024
More
    Homeక్రిమినల్ కేసులుకొట్లాటలుకోట్లాటలలో ఎ1, ఎ2 నిందుతులను ఎలా గుర్తిస్తారు?

    కోట్లాటలలో ఎ1, ఎ2 నిందుతులను ఎలా గుర్తిస్తారు?

    కోట్లాటలో నైనా, ఏ కేసులోనైనా ఎ1, ఎ2, ఎ3 అని ముద్దాయిలు ఉంటారు. ఎ1 అంటే ప్రధాన ముద్దాయి అని. అంటే ఆ గొడవకు అతనే మూలం. సాధారణంగా ఎంత మంది ముద్దాయిలు ఉంటే అంతమందికి సమాన శిక్షనే పడుతుంది. కానీ ఘటన జరిగిన తీరును బట్టి ఎ1,ఎ2 లకు ఎక్కువ శిక్ష పడి మిగిలిన వారికి తక్కువ శిక్ష పడే అవకాశం కూడా ఉంది. ఉదాహరణకు ఒక మర్డర్‌ కేసులో ఒకరే పొడిచారు, దాని వల్లే అతను చనిపోయాడని అనుకుందాం. కానీ మిగిలిన మరో నలుగురు ముద్దాయిలు కూడా చనిపోయిన వ్యక్తితో ఘర్షణ పడిన వారిలో ఉన్నారు. ఈ కేసులో ఎ1 ముద్దాయికి జీవిత ఖైదు గానీ, 14 ఏళ్ల జైలు శిక్ష కానీ పడుతుంది. మిగిలిన వారికి కాస్త తక్కువ శిక్ష పడే అవకాశముంది.

    Most Popular