దొంగతనం కేసులో నిర్ధోషులను ఇరికించడం అప్పుడప్పుడు జరుగుతుంది. పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగా ఇరికించిన ఘటనలు అక్కడక్కడా ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో తాము దొంగతనం చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. కోర్టులో మీరు రుజువు చేసుకుంటే కేసు నుంచి బయటపడతారు. ఒక వేళ మిమ్మల్ని అక్రమంగా కేసులో ఇరికించి పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచి కొట్టడం లాంటి చర్యలకు పాల్పడితే మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసి రక్షణ పొందవచ్చు.