Sunday, October 13, 2024
More
    Homeక్రైమ్ న్యూస్మీరెప్పుడైనా గంజాయి కేకులు తిన్నారా..లేదా..అయితే చదవండి

    మీరెప్పుడైనా గంజాయి కేకులు తిన్నారా..లేదా..అయితే చదవండి

    లాక్‌డౌన్‌ కాలంలో ఒక జంట ముంబయిలోని మలద్‌లో ఒక బేకరి ఓపెన్‌ చేసింది. కేకులు అమ్మడం ప్రారంభించింది. అయితే ఇవి మాములు కేకులు కాదండోరు..గంజాయి కేకులు. వీటిల్లో ఇడిబుల్‌(తినగలిగిన) గంజాయి ఉంటుంది. ఒక వెబ్‌ సిరీస్‌ నుంచి ఈ జంట ఈ ఐడియాను స్వీకరించింది. కస్టమర్ల నుంచి ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ తీసుకుంటారు. వారు డబ్బులు ఆన్‌లైన్‌లో చెల్లించిన తర్వాత వారికి పార్శిల్‌ చేరుతుంది. కొద్ది నెలల పాటు ఈ వ్యాపారం బాగానే సాగింది. ఈలోపు పోలీసులు పట్టేసుకున్నారు.

    ఆ సమయంలో వారి వద్ద 833 గ్రాములు ఇడిబుల్‌ గంజాయి, 160 గ్రాముల మాములు గంజాయి దొరికింది. వారి క్లయింట్ల లిస్ట్‌ను ఒక పుస్తకంలో రాసుకున్నారు. వారందర్నీ పోలీసులు ఇప్పుడు ట్రాక్‌ చేస్తున్నారు. అసలు వీరికి గంజాయి ఎవరు సప్లయి చేస్తున్నారనే అంశంపై ముంబయి పోలీసులు సీరియస్‌గా విచారణ సాగిస్తున్నారు. గంజాయి కేకులు దాదాపు మాములు కేకులులాగే ఉంటాయని, వాటి తేడాను కనిపెట్టడం సాధ్యం కాదని పోలీసులు చెప్తున్నారు.

    Most Popular