Wednesday, May 1, 2024
More
    Homeసివిల్ కేసులుమెడికల్ కేసులుప్రయివేట్‌ డాక్టర్‌ తప్పుడు వైద్యం చేస్తే కేసు వేయవచ్చా?

    ప్రయివేట్‌ డాక్టర్‌ తప్పుడు వైద్యం చేస్తే కేసు వేయవచ్చా?

    ప్రయివేట్‌ డాక్టర్‌ వైద్యం చేయడంలో అంటే రోగాన్ని నిర్ధారించడంలోగానీ, మందులివ్వడంలో గానీ, ఆపరేషన్‌ చేయడంలో గానీ తప్పు చేస్తే ఆ బాధిత రోగి కచ్చితంగా కోర్టుకు వెళ్లవచ్చు. అయితే ఈ అంశంలో కేవలం వినియోగదారుల ఫోరంలో మాత్రమే ఫిర్యాదు చేయాలి. అలాగే ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌కు కూడా ఫిర్యాదు చేయవచ్చు. వినియోగదారుల ఫోరం ద్వారా రోగి నష్టపరిహారం పొందుతాడు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఆ డాక్టర్‌ తప్పు చేశాడని నిర్ధారించుకుంటే చర్యలు తీసుకుంటుంది. కొద్ది రోజుల పాటు అతని వృత్తి పరమైన లైసెన్స్‌ను సస్పెండ్‌ చేసే అవకాశముంది. మొదట జిల్లా స్థాయి వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చు. అక్కడ న్యాయం దొరక్కుంటే రాష్ట్రస్థాయి వినియోగదారుల కమిషన్‌కు, ఇంకా కావాలంటే నేషనల్‌ కమిషన్‌కు కూడా వెళ్లవచ్చు.

    Most Popular