Thursday, May 9, 2024
More
    Homeసివిల్ కేసులుభూ రిజిస్ట్రేషన్ కేసులుభూమి రిజిష్ట్రేషన్‌ కోసం ఏఏ పత్రాలను సిద్దం చేసుకోవాలి?

    భూమి రిజిష్ట్రేషన్‌ కోసం ఏఏ పత్రాలను సిద్దం చేసుకోవాలి?

    ఎవరి దగ్గరైనా మనం భూమి కొనాలంటే ముందుగా వారి వద్ద నుండి కొన్ని డాక్యుమెంట్లను జిరాక్స్‌ తీసుకోని పరిశీలించుకోవాలి. మనం భూమిని కొని రిజిష్ట్రేషన్‌ చేసుకోవాలంటే ముఖ్యంగా ముందుగా విక్రయ దస్తావేజు ఉందో లేదో చూసుకోవాలి. ఆ తర్వాత ఆ భూమికి సంబంధించిన లింక్‌ డాక్యుమెంట్‌ను చూసుకోవాలి. ఆ లింక్‌ డాక్యుమెంట్‌లోనే ఆ భూమి ఎవరి దగ్గరి నుంచి ఎవరికి వచ్చింది, ఆ భూమి పుట్టు పూర్వోత్తరాలు ఏంటి అనేది మనకు తెలుస్తుంది. కనీసం 12 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు ఉన్న లింక్‌ డాక్యుమెంట్లను తప్పనిసరిగా చూసుకోవాలి. అలాగే ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ అని ఉంటుంది. దీన్నే ఇసి అంటారు. రిజిష్టార్‌ ఆఫీస్‌ నుంచి ఏ భూమికి సంబంధించిన ఇసినైనా కొంత రుసుము చెల్లించి మనం పొందవచ్చు. ఈ మూడింటితోపాటు అది వ్యవసాయ భూమి అయితే భూ యాజమాన్యపత్రం, భూమి శిస్తులు కూడా తీసుకోవాలి. అది వ్యవయేతర భూమి అయితే మున్సిపాల్టీకి కానీ, గ్రామ పంచాయితీకి గానీ చెల్లించిన పన్ను రశీదులను పరిశీలించుకోవాలి.

    Most Popular