ప్రభుత్వం నేరుగా కాకుండా, కాంట్రాక్టర్ నుండి ఉద్యోగులను నియమించుకుంటుంది. ప్రభుత్వానికి ఉద్యోగితో ఎటువంటి సంబంధం ఉండదు. కాంట్రాక్టర్ తోనే ఒప్పందం ఉంటుంది. ఆ కాంట్రాక్టర్ సిబ్బందిని సెలక్ట్ చేసి ప్రభుత్వ విధులకు పంపిస్తారు. ఇలా నియమించినప్పటికీ అవుట్ సోర్స్‌డ్ ఉద్యోగిని కూడా కాంట్రాక్ట్ ఉద్యోగిగానే భావించాల్సి ఉంటుంది. ఇతన్ని తొలగిస్తే వినియోగదారుల సంఘంలో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఉద్యోగికి ఇవ్వాల్సిన సర్వీసెస్‌ను సక్రమంగా ఇవ్వలేదు కాబట్టి వినియోగదారుల సంఘం నుంచి పొందవచ్చు.