Tuesday, November 12, 2024
More
    Homeసివిల్ కేసులుభూ రిజిస్ట్రేషన్ కేసులుఏదైనా భూమిని కొనేముందు చెక్‌ చేసుకోవాల్సిన పత్రాలేంటి?

    ఏదైనా భూమిని కొనేముందు చెక్‌ చేసుకోవాల్సిన పత్రాలేంటి?

    ఏదైనా భూమిని మీరు కొనాలంటే నాలుగు పత్రాలను మీరు తప్పనిసరిగా చెక్‌ చేసుకోవాలి. వారి వద్ద ఉన్న విక్రయ దస్తావేజు సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి. ఆ తర్వాత వారి వద్ద ఆ భూమికి సంబంధించిన లింక్‌ డాక్యుమెంట్లు ఉన్నాయో లేవో సరిచూసుకోవాలి. లింక్‌ డాక్యుమెంట్‌ కనీసం 12 ఏళ్ల నుండి 30 ఏళ్ల వరకు ఉండాలి. అదే విధంగా రిజిష్ట్రార్‌ కార్యాలయం నుంచి ఆ భూమికి సంబంధించి ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ అంటే ఇసి తీసుకొని అసలు భూమి వారిదేనా, విక్రయ దస్తావేజు సరైన దేనా కాదా అనేది చెక్‌ చేసుకోవాలి. వీటితోపాటు ఆ భూమికి లేదా ఆస్తికి సంబంధించి ప్రభుత్వానికి కట్టిన పన్నుల రశీదులను కూడా చెక్‌ చేసుకోవాలి.

    Most Popular