దేవాలయాలు, మసీదులు, చర్చీల నిర్వహణ కోసం ఎప్పుడో దాతలు ఇచ్చిన భూములను అమ్మే అధికారం ఎవ్వరికీ లేదు. ఇవి ఆ సంబంధిత ఆలయాల రోజువారీ నిర్వహణకు మాత్రమే ఉపయోగించాలి. ప్రభుత్వానికి కూడా దేవాదాయ భూములను అమ్మే హక్కు లేదు. అయితే ఆ దేవాలయాలు, ఆ మసీదులకు అదనపు ఆదాయాన్ని సమకూర్చేలా ఆ భూములను నిర్వహించే అధికారం మాత్రం ఎవరికైనా ఉంది. సంబంధిత ఆలయ ట్రస్టీ నుంచి అనుమతి తీసుకొని ఆ భూములను ఆదాయ మార్గాలుగా మార్చవచ్చు. అయితే వీటిని నిర్వహించే హక్కు మాత్రమే లభిస్తుంది కానీ వీటికి యాజమాన్య హక్కు మాత్రం రాదు.