వయసు మళ్లిన తల్లితండ్రులను పోషించాల్సిన బాధ్యత పూర్తిగా పిల్లలపై ఉంటుంది. పిల్లలంటే కేవలం కొడుకులేకాదు కూతుళ్లపైన కూడా ఉంటుంది. ఇది ధర్మం కూడా. ఇది ధర్మమే కాదు సిఆర్‌పిసి సెక్షన్ 125 ప్రకారం ఏ బిడ్డలయితే తల్లితండ్రులను షోషించడానికి ఇష్టపడరో ఆ బిడ్డల నుండి తల్లితండ్రులు సంరక్షణ కోరుకోవచ్చు. మనోవర్తి కూడా పొందవచ్చు. ఒక వేళ మనోవర్తి చెల్లించకపోతే బిడ్డలను కోర్టు జైలుకు పంపిస్తుంది.