మైనర్లను కుటుంబ వృత్తుల్లో పనిచేయించుకోవచ్చు. అయితే 14 ఏళ్లలోపు బాలబాలికలు తప్పనిసరిగా పాఠశాలకు వెళ్లాలి. అది వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు.. ఒక వేళ ఆ తల్లితండ్రులకు తమ పిల్లలను పోషించుకోలేని పరిస్థితి వస్తే ప్రభుత్వానికి అప్పచెప్పాలి. ప్రభుత్వం వారిని బాలల హోమ్స్‌లలో పెట్టి చదువు, విద్యా, అన్ని అవసరాలను తీరుస్తుంది.