Thursday, November 21, 2024
More
    Homeసంచలన తీర్పులుభార్య ప్రియుణ్ని చంపిన భర్తకు శిక్ష ఎంతో తెలుసా?

    భార్య ప్రియుణ్ని చంపిన భర్తకు శిక్ష ఎంతో తెలుసా?

    కె.ఎం.నానావతి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర కేసు 1959 కాలంలో పెద్ద సంచలనాన్నే సృష్టించింది. నానావతి పార్శి కుటుంబానికి చెందిన వాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉండేది. ఇతనికి ఆహుజా అని సింధూ కుటుంబానికి చెందిన ఆహుజాతో 15 ఏళ్ల నుంచి స్నేహం ఉండేది. నానావతి ఉద్యోగరీత్యా ఎక్కువగా ప్రయాణాల్లో ఉండేవాడు. ఈలోపు నానావతి భార్య, ఆహుజా మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. అది వారిద్దరి మధ్య పెళ్లి చేసుకునేంత బంధం ఏర్పడేవరకు వెళ్లింది. కానీ ఈలోపు ఆహుజాకు ఇతర అమ్మాయిలతోనూ సంబంధాలు ఉన్నాయని నానావతి భార్యకు అర్ధమైంది. దీంతో ఆహుజా తనను పెళ్లి చేసుకోడేమోననే అనుమానాలు అమెకు కలిగాయి. ఈ కారణంతో ఆమె డిస్ట్రబ్‌ అయ్యింది. ఒకరోజున నానావతి ప్రయాణాన్ని ముగించుకొని ఇంటికొచ్చాడు. అప్పుడు తన భార్య దిగాలుగా ఉండడాన్ని గమనించి ప్రశ్నించాడు. ఆమె జరిగిన సంగతంతా భర్తకు చెప్పింది. వారిద్దరి మధ్య కాస్త వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత నానావతి భార్య, బిడ్డలను తీసుకొని సినిమాకు వెళ్లాడు. వాళ్లను సినిమాకు పంపించి నేరుగా ఆహుజా ఇంటికి వెళ్లాడు. అతన్ని అక్కడే చంపేశాడు. ఈ ఘటన అప్పట్లో పెద్ద సంచలనమే అయ్యింది.

    మీడియా రెండుగా విడిపోయి నానావతికి కొన్ని పత్రికలు, ఆహుజాకు అనుకూలంగా కొన్ని పత్రికలు వార్తలు ప్రచురించాయి. నానావతి ప్రజల్లో సానుభూతి పెరిగింది. నానావతి చేసింది హత్య కాదని ఆవేశంలో జరిగిన ఒక ఘటన మాత్రమేనని అతని తరపు లాయర్‌ కార్ల్‌ కందనవాల వాదించారు. దీంతో కింది కోర్టు ఏకభవించి నానావతి మర్డర్‌ చేయలేదు…కల్పబుల్‌ హోమీసైడ్‌కు మాత్రమే పాల్పడ్డాడని నిర్ధారణకు వచ్చింది. మర్డర్‌ అయితే జీవిత ఖైదు విధిస్తారు. అదే కల్పబుల్‌ హోమీసైడ్‌ అయితే పది సంవత్సరాల జైలు శిక్ష మాత్రమే ఉంటుంది. ఆహాజా తరపున వాదించిన రామ్‌ జెఠ్మలాని బొంబే హైకోర్టుకు వెళ్లారు. హైకోర్ట్‌ నానావతి చేసింది మర్దరే అని తేల్చింది. అతనికి జీవితఖైదు విధించింది. అయితే ఈ తీర్పుపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమయింది. ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. దగాపడ్డ భర్తగా, స్నేహితుని చేతిలో మోసపోయిన వ్యక్తిగా నానావతి చేసిన హత్యను అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదనేది అనాడు ప్రజల్లో వ్యక్తమైన అభిప్రాయం. దీంతో చివరకి మహారాష్ట్ర గవర్నర్‌ విజయలక్ష్మీ పండిట్‌ నానావతికి క్షమాభిక్ష పెట్టడడంతో జైలు నుంచి విడుదలఅయ్యాడు. ఈకేసు మీద చాలా పుస్తకాలు, కధలు, నవలలు వెలువడ్డాయి. అక్షరుకుమార్‌, ఇలియాన జోడిగా రుస్తుమ్‌ అనే సినిమాను కూడా ఈ కేసు ఆధారంగానే నిర్మించారు. ది వెరిడిక్ట్‌ అనే వెబ్‌ సిరీస్‌ కూడా ఈ కేసు ఆధారంగానే నిర్మించారు.

    Most Popular