భారత దేశంలో ఎవరైనా మంతాతర వివాహాలు చేసుకోవచ్చు. కులాంతర వివాహాలు చేసుకోవచ్చు. అయితే వారు ఆ విధంగా చేసుకునేప్పుడు భారత ప్రత్యేక వివాహా చట్టం కింద రిజిస్ట్రర్ చేసుకోవాల్సి ఉంటుంది. మతాంతర వివాహాం చేసుకున్నప్పుడు వారికి వారి మతాల ప్రకారం ఉన్న చట్టాలు చెల్లుబాటు కావు. ఉదాహరణకు హిందూ వివాహా చట్టం ప్రకారం వివాహం చేసుకున్న వారికి విడిపోయే సమయంలో కొన్ని ప్రత్యేక రక్షణలు అటు పురుషుడికి, ఇటు మహిళకు ఉంటాయి. అదే మతంతార వివాహం చేసుకుంటే హిందూ వివాహా చట్టం కానీ, క్రిస్టియన్ వివాహా చట్టం ద్వారా గానీ వచ్చే ప్రత్యేక రక్షణలు వీరికి రావు. కానీ భారత ప్రత్యేక వివాహా చట్టం ప్రకారం వీరికి రక్షణలు కల్పించబడతాయి. అలాగే వీరికి విడాకులు కావాలంటే ప్రత్యేక వివాహా చట్టం ప్రకారం మంజూరు చేస్తారు. మనోవర్తి గానీ, బిడ్డలకు సంబంధించి వారసత్వ హక్కులు గానీ సిఆర్‌పిసి 125 సెక్షన్ ప్రకారం సంక్రమిస్తాయి.