భార్య,భర్తలు పెళ్లయిన తర్వాత ఒక ఏడాది తర్వాత గానీ, ఒక ఏడాది పాటు విడివిడిగా జీవించిన తర్వాత గానీ, లేదా పెళ్లయిన కొత్తలోనే వేధింపులు కారణంగా గానీ విడాకుల కోసం భార్య,భర్తలు కోర్టుకు రావచ్చు. విడాకులు ప్రధానంగా నాలుగు కారణాలపైన ఇస్తారు. ఒకటి భార్యను భర్త గానీ, భర్తను భార్య గానీ వేధించడం, కొట్టడం, 2. పెళ్లయిన తర్వాత మతం మార్చుకోవడం, 3. వేర్వేరు కారణాల రీత్యా రెండేళ్ల పాటు భార్య,భర్తలు ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఒక్కసారి కూడా కలవకుండా వేర్వేరుగా జీవిస్తూ ఉండడం, 4. ఎప్పటికీ నయం కాని జబ్బులతో ఎవరో ఒకరు బాధపడుతూ ఉండడం…ఈ నాలుగు కారణాల రీత్యా భార్య,భర్తలకు విడాకులు ఇస్తారు.