గుళ్లలో విగ్రహాలు కానీ, ఆభరణాలు కానీ ఇవ్వన్నీ దేవాదాయ శాఖకు చెందిన ఆస్థి. విగ్రహాలు బంగారంతో తయారు చేసినా, మట్టితో తయారు చేసినా వాటిని దొంగలిస్తే శిక్ష తప్పదు. అయితే మాములు దొంగతనాలకు ఎలాంటి శిక్ష ఉంటుందో ఈ దొంగతనాలకు కూడా అలాంటి శిక్షే ఉంటుంది. దేవుడికి అపచారం జరిగిందని చెప్పి చట్టం ప్రకారం ఎక్కువ శిక్ష వేయడం కుదరదు. ఐపిసి సెక్షన్ 379 ప్రకారం విగ్రహాల దొంగలకు రెండేళ్ల శిక్ష పడుతుంది.