ఏ కేసులో నైనా బెయిల్ ఇవ్వాలా లేదా అనేది జడ్జీ విచాక్షణా అధికారాలపైన ఆధారపడి ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏడేళ్ల శిక్ష కన్నా తక్కువ పడే కేసుల్లో బెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక వేళ నిందితుడిపైన మరేవైనా ఇతర కేసులు కూడా ఉండి, అవి సీరియస్ కేసులైతే జడ్జి బెయిల్ ఇవ్వకపోవచ్చు. కానీ సాధారణంగా దొంగతనం కేసులో బెయిల్ వస్తుంది.