మీపై పెట్టిన కేసు తప్పుడు కేసా కాదా అనేది కోర్టులోనే తేలాలి. ఏ కేసైనా దానికి పోలీసులు సేకరించి సమర్పించే సాక్ష్యాధారాలపైనే ఆధారపడి ఉంటుంది. వాటిని పోలీసులు సరిగ్గా సమర్పిస్తే శిక్ష తప్పక పడుతుంది. అయితే తప్పుడు కేసు బనాయించినప్పుడు సాక్ష్యాధారాలను సేకరించి సమర్పించే సమయంలో పోలీసులు ఎక్కడో అక్కడ చట్టానికి విరుద్దంగా వ్యవహరిస్తాడు. ముద్దాయి తరపున సమర్ధుడైన లాయర్ ఉంటే కేసు నుంచి బయటపడవచ్చు.