Thursday, November 21, 2024
More
    Homeక్రిమినల్ కేసులుహత్యాయత్నం కేసుల్లో ఎంత శిక్ష పడే అవకాశం ఉంది?

    హత్యాయత్నం కేసుల్లో ఎంత శిక్ష పడే అవకాశం ఉంది?

    సెక్షన్‌ 307 ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ ప్రకారం హత్యాయత్నం కేసులో పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో అదనంగా ఫైన్‌ కూడా విధించవచ్చు. హత్యాయత్నం చేసిన పరిస్థితులను బట్టి జీవిత ఖైదు కూడా విధించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒక మనిషిపైన దాడి చేసినప్పుడు చంపే ఉద్దేశ్యంతోనే దాడి చేశారా లేక కోట్లాటలో భాగంగా జరిగిందా అనేది కోర్టు పరిశీలిస్తుంది. తల మీద కానీ, వట్టల మీద గానీ కొడితే దాన్ని హత్యాయత్నం గానే భావిస్తారు. తల మీద తగిలిన దెబ్బ ఎంత గట్టిగా తగిలింది, చంపాలనే ఉద్దేశ్యంతో, ఎప్పటి నుంచో కుట్ర పన్ని కొట్టారా అనేది కోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది. ఎన్నాళ్ల నుంచో కుట్ర పన్ని, పథకం ప్రకారం రచించి హత్యాయత్నం చేస్తే వారికి జీవితఖైదు విధించే అవకాశం ఉంది.

    Most Popular