మ్యాగ్జిమమ్ రిటైల్ ప్రైస్ ప్రతి వస్తువుకూ ఉంటుంది. ఆ వస్తువులను తయారు చేసే కంపెనీలే ఎంఆర్‌పిని నిర్ణయిస్తాయి. కొంత మంది ఎంఆర్‌పిని కొట్టివేసి వాళ్ల ధరతో స్టిక్కర్ వేసి ఎక్కువ ధరకు అమ్ముతుంటారు. కొంతమంది ఆ వస్తువుకు ఎక్కువ డిమాండ్ ఉంటే ఎంఆర్‌పి కన్నా అధిక ధరకు అమ్ముతుంటారు. ఇది తూనికలు,కొలతలు చట్టం ప్రకారం నేరం అవుతుంది. ఎవరైనా దీనిపైన ఫిర్యాదు చేయవచ్చు. వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. వారు పట్టించుకోకపోతే చీటింగ్ కింద పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టవచ్చు.