మీ స్థలాన్ని ఎవరైనా కబ్జా చేస్తే కోర్టు ద్వారానే తేల్చుకోవాలి. తగిన పత్రాలన్ని తీసుకొని కోర్టులో డిక్లరేషన్ కమ్ పొజిషన్ సూట్ వేయాలి. ఈ కేసు వేయడానికి విక్రయ దస్తావేజు, లింక్ డాక్యుమెంట్, ఇంకన్బరేషన్ సర్టిఫికెట్ తీసుకొని కోర్టుకు వెళ్లాలి. కోర్టులో ఆలస్యమౌతుందనే ఆందోళన కూడా అవసరం లేదు. ఏ కేసునైనా కోర్టులు ఆరు నుంచి ఏడు నెలల్లో పరిష్కరించేస్తాయి. ఒక వేళ ఆలస్యమయిందంటే అది ఇరు వైపుల ఉన్నా క్లయింట్ల వల్లే జరుగుతుంది.