1985కు ముందు పరిస్తితి వేరు. అప్పట్లో హిందూ వారసత్వ చట్టం ప్రకారం తండ్రి ఆస్తిలో కూతుళ్లకు వాటా లేదు. కానీ అప్పటి టిడిపి ప్రభుత్వం ఆడపిల్లలకు ఆస్తిలో వాటా కల్పిస్తూ చట్టం చేసింది. అప్పటి నుండి తెలుగు వాళ్లకు మాత్రం ఆడపిల్లలకు కూడా ఆస్తిలో వాటా ఉంది. తండ్రి స్వఆర్జితమైన, పూర్వికుల నుండి వచ్చిన ఆస్తి అయినా కొడుకుతోపాటు కూతురికి కూడా సమాన వాటా లభిస్తుంది. అయితే మన దేశంలోనే కొన్ని రాష్ట్రాల్లో ఈ చట్టం చేయనందున అక్కడ మాత్రం కూతుళ్లకు వాటా లేదు.