Sunday, December 22, 2024
More
    Homeలీగల్ న్యూస్రిటైర్డ్‌ ఐఎఎస్‌ ఉదయలక్ష్మికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌!

    రిటైర్డ్‌ ఐఎఎస్‌ ఉదయలక్ష్మికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌!

    రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి ఉదయలక్ష్మికి ఎపి హైకోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ (పిఇటి) అంశంలో కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేయడంతో ఈ వారెంట్‌ జారీ అయింది. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన రత్నకుమార్‌ అనే పిఇటి ఉపాధ్యాయుడు తనకు అన్యాయం చేశారంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో రత్నకుమార్‌కు న్యాయం చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే గతంలో ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌గా పనిచేసిన ఉదయలక్ష్మి హైకోర్టు ఆదేశాలను పట్టించుకోలేదు. దీన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించిన న్యాయస్థానం.. వచ్చే విచారణలో ఉదయలక్ష్మిని హాజరుపరచాలని గుంటూరు ఎస్‌పిని ఆదేశించింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని గతంలో విద్యాశాఖలో పనిచేసిన ఆదిత్యనాథ్‌ దాస్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలపాటు వాయిదా వేసింది.

    Most Popular