భార్య,భర్తలు ఇద్దరూ సంపాదనపరులైతే విడాకులు తీసుకుంటే భార్యకు మనోవర్తి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. విడాకులకు ముందు ఆమెకు సంపాదన ఉండి విడాకుల సమయానికి ఆమెకు ఆదాయం లేకపోతే భర్త కచ్చితంగా మనోవర్తి ఇవ్వాల్సి ఉంటుంది. భార్య తనను తాను పోషించుకోలేదు కాబట్టి భర్త మనోవర్తి ఇవ్వాల్సి ఉంటుంది. ఒక వేళ విడాకులు తీసుకున్న తర్వాత భార్య మరో పెళ్లి చేసుకుంటే కూడా మనోవర్తి ఇవ్వాల్సిన అవసరం లేదు.