Saturday, November 23, 2024
More
    Homeసివిల్ కేసులువంశపారంపర్య కేసులుఒక తండ్రి తన ఆస్తులను కొడుకులకు పంచిన తర్వాత తిరిగి తీసుకోవచ్చా?

    ఒక తండ్రి తన ఆస్తులను కొడుకులకు పంచిన తర్వాత తిరిగి తీసుకోవచ్చా?

    అలా తీసుకోవడానికి వీల్లేదు. ఒక్కసారి పంపకం అంటూ జరిగిన తర్వాత అది ఫైనల్‌. చట్టప్రకారం అది పంపకం పూర్తిఅయినట్లు. పంపకం జరిగిన తర్వాత ఆ ఆస్తిని స్వాధీన పరుచినట్లు అవుతుంది. ఒక్కసారి స్వాధీనం లోకి తీసుకున్న తర్వాత తిరిగి తీసుకోవడానికి ఉండదు. అయితే ఆ ఆస్తిని కొడుకులు తండ్రి వద్ద నుండి వక్రమ మార్గంలో పంపకం చేసుకున్నారని భావిస్తే కోర్టు ద్వారా తండ్రి తిరిగి ఆస్తులను పొందవచ్చు. సాధారణ పరిస్థితుల్లో మాత్రం ఒక్కసారి పంపకం అయిపోయిన తర్వాత తిరిగి ఆస్తిని పొందలేరు. అయితే ఆ తండ్రికి గాని, తల్లికి గాని జీవించడం కష్టంగా ఉందని, డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్నారంటే వారు కొడుకుల నుండి మనోవర్తి పొందవచ్చు.

    Most Popular