ఏ వ్యక్తి కైనా ఆస్తి రెండు రకాలుగా వస్తుంది. ఒకటి స్వఆర్జితం. అంటే అతను కష్టపడి సంపాదించుకున్నది. రెండు పూర్వికుల నుండి వచ్చి ఆస్తి. స్వఆర్జితం ఆస్తి అమ్మేటప్పుడు ఎవరి సంతకం అవసరం లేదు. అతనొక్కడు అమ్మితే సరిపోతుంది. అదే పూర్వికుల నుంచి వచ్చిన ఆస్తి అయితే ఆ పూర్వకునికి చెందిన వారసులందరూ సంతకం చేయాల్సి ఉంటుంది. పూర్వికుల ఆస్తిలో భార్యకు కూడా హక్కు ఉంటుంది. భార్య సంతకం పెట్టకపోయినా ఆ ఆస్తిని అమ్మే హక్కు అతనికి ఉండదు.