పెరోల్ అంటే శిక్ష అనుభవించే ఖైదీకి కొన్ని ప్రత్యేక సందర్బాల్లో బయటకు వెళ్లేందుకు అనుమతినివ్వడం. ఇంత కాలం పాటు అని పెరోల్ ఉంటుంది. పెరోల్ కాలంలో ఆ ఖైదీపై పోలీసుల నిఘా ఉంటుంది. భార్యకు డెలివరీ అయితేనో, తల్లితండ్రులు చనిపోతేనో, లేక ఇంట్లో వారికి యాక్సిడెంట్ అయితేనో ఇలాంటి సందర్బాల్లో పెరోల్ ఇస్తారు. పెరోల్‌ను ప్రిజన్ యాక్ట్ 1894 ప్రకారం అనుమతినిస్తారు.