18 ఏళ్లలోపు బాల, బాలికలు అంటే మైనర్లు అని అర్ధం. మైనర్లును ఎవ్వరూ పనిలో పెట్టుకోకూడదు. బాలల హక్కుల చట్టం ప్రకారం ఎవరైనా వీరిని పనిలో పెట్టుకుంటే రెండు నుండి ఐదేళ్ల వరకు ఆ యజమానికి శిక్షపడుతుంది. దీంతోపాటు అపరాధ రుసుము కూడా విధిస్తారు. కానీ ఎవరైనా వీరిని పనిలో పెట్టుకోవాలని అనుకుంటే ప్రభుత్వం నుండి ప్రత్యేక అనుమతిని పొందాల్సి ఉంటుంది. అయితే మన దేశంలో బాలలందరికీ ప్రాధమిక విద్యను ఒక హక్కుగా కల్పించారు. పిల్లల్లందరూ తప్పనిసరిగా బడికి వెళ్లాల్సిందే.