Monday, October 14, 2024
More
    Homeక్రిమినల్ కేసులుకొట్లాటలురెండు గ్రూపుల వారు కోట్లాటలో పాల్గొని ఇద్దరికీ దెబ్బలు తగిలితే ఇరువురికి శిక్ష పడుతుందా?

    రెండు గ్రూపుల వారు కోట్లాటలో పాల్గొని ఇద్దరికీ దెబ్బలు తగిలితే ఇరువురికి శిక్ష పడుతుందా?

    రెండు గ్రూపుల వారు కొట్లాటలో పాల్గొని దెబ్బలు తగిలితే ఇరు వర్గాలకూ శిక్ష పడే అవకాశముంది. రెండు గ్రూపుల వారు సహజంగానే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. ఆ ఫిర్యాదు ద్వారా పోలీసులు విచారణ జరిపి కేసు కడతారు. రెండు గ్రూపులు ఫిర్యాదు చేస్తే ఇద్దరి మీద కేసు కడతారు. అయితే దెబ్బలు తగిలిన తీవ్రతను బట్టి సెక్షన్లను నమోదు చేస్తారు. కొట్లాటకు ఎవ్వరు ముందు వచ్చారు..ఎవ్వరికీ ఎక్కువగా దెబ్బలు తగిలాయి అనేది ప్రధానంగా చూస్తారు. తలమీద గానీ, టెస్టికల్స్‌ మీద గాని దెబ్బ తగిలితే దాన్ని హత్యాయత్నంగా పరిగణిస్తారు. దీనికి ఏడేళ్ల వరకు శిక్ష ఉంటుంది. చిన్న చిన్న దెబ్బలు తగిలితే ఏడాది నుంచి రెండేళ్ల లోపు మాత్రమే శిక్ష ఉంటుంది.

    Most Popular