ఆస్తి రెండు రకాలు. ఒకటి తన స్వయంకృషితో, కష్టంతో సంపాదించుకున్న స్వఆర్జితం. రెండోది తన పూర్వికుల నుండి వచ్చిన ఆస్తి. తన స్వఆర్జితం ఆస్తిని తండ్రి ఎవ్వరికైనా రాసి ఇవ్వవచ్చు. తన పిల్లలకు ఒక పైసా కూడా ఇవ్వకుండా ఇంకోకరికి ఎవరికైనా మొత్తం రాసి ఇవ్వవచ్చు. చట్టపరంగా అతనికి ఆ హక్కు ఉంది. అదే తన పూర్వికుల నుండి వచ్చిన ఆస్తి తన పిల్లలకు, భార్యకు తప్ప ఎవ్వరికీ రాసిఇవ్వడానికి వీల్లేదు. పూర్వికుల ఆస్తిని తన పిల్లలకు సమానంగా పంచి ఇవ్వవలసిందే. కూతుళ్లు, కొడుకులు అనే తేడా కూడా లేదు. తండ్రి ఆస్తికి కొడుకులు, కూతుళ్లు ఇద్దరూ సమాన వారసులే.